FbTelugu

వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతాలు: జిల్లా కలెక్టర్

భోపాల్: దేశంలో కరోనా సెకండ్ వచ్చినా ప్రజల్లో ఇంకా వ్యాక్సిన్ పై భ్రమలు తొలగిపోలేదు. ఇప్పటికీ పలువురు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్ పై ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉజ్జయిని జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారికి మాత్రమే జూలై నెల వేతనాలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని జిల్లా కలెక్టర్ ఆశీష్ సింగ్ సర్క్యూలర్ జారీ చేశారు. జూలై నెలాఖరు లోపు వ్యాక్సిన్ వేయించుకోనట్లయితే వేతనం రాదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు వంద శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్నవారు ధృవపత్రాలు అందచేయాలని కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.