FbTelugu

హెచ్.పి.సి.ఎల్ ప్రమాదం చిన్నదే: జిల్లా కలెక్టర్

విశాఖపట్నం: హెచ్.పి.సి.ఎల్ అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణనష్టమేమి జరగలేదని, అరగంటలోనే మంటలను అదుపులోకి తెచ్చారని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.

ప్రమాదం ప్రారంభంలోనే అధికారులు అప్రమత్తమై సైరన్ మోగించడంతో ఉద్యోగులందరూ బయటకు రావడంతో పెద్ద నష్టం తప్పిందన్నారు. ఈ ప్రమాదం లో ఏ ఒక్కరికి గాయాలు కాలేదన్నారు. దీనిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాత టెర్మినల్ క్రూడ్ డిస్టిలేషన్ 3వ యూనిట్ లో మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకుని చూస్తుండగానే మంటలు యూనిట్ మొత్తానికి అంటుకున్నాయన్నారు. సైరన్ మోగించడంతో ఉద్యోగులందరూ బయటకు వచ్చారని, ఈలోపు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని 20 వాహనాలతో మంటలను ఆర్పివేశారని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.