FbTelugu

ఈటల ఆధీనంలో అసైన్డు భూమి: జిల్లా కలెక్టర్

మెదక్: మంత్రి ఈటల రాజేందర్ ఆధీనంలో ఉన్న భూమిలో అసైన్డు భూమి ఉన్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి ఏసిబి, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారన్నారు.

క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిన తరువాత, రికార్డులు పరిశీలించి నివేదిక సమర్పిస్తామని జిల్లా కలెక్టర్ హరీశ్ కుమార్ రెడ్డి చెప్పారు. తూఫ్రాన్ ఆర్డీఓ రాం ప్రకాశ్ ఆధ్వర్యంలో మొత్తం ఆరు బృందాలు భూములు సర్వే చేస్తున్నాయన్నారు. ఈటల భూములతో పాటు పక్కనే ఉన్న భూముల్లో డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.