FbTelugu

5 నిమిషాల ప్రెజర్ కే 11 మంది మృతి: జిల్లా కలెక్టర్

చిత్తూరు: రుయాలో సోమవారం రాత్రి 8 గంటలకు 5 నిముషాల పాటు ఆక్సిజన్ ప్రెజర్ పెరిగిందని, డాక్టర్ల అప్రమత్తం తో పెద్ద ప్రమాదం తప్పిందిని జిల్లా కలెక్టర్ ఎం.హరిణారాయణన్ వెల్లడించారు.

5 నిమిషాల ప్రెజర్ కే ఐసియులో ఉన్న 11 మంది కరోనా రోగుల ప్రాణాలు పోవడం దురదృష్టకరం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి విచారణ కు ఆదేశించారన్నారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రత్యామ్నాయం గా బల్క్ సిలిండర్ల అందుబాటులో పెట్టామన్నారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ఆక్సిజన్ కొరత లేదన్నారు. 1000 మంది రోగులకు చికిత్స చేసే ఆసుపత్రిలో 700 వరకు ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. ఘటన తెలియగానే రాత్రి వెళ్లి పరిస్థితి సమీక్షించి చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.