FbTelugu

వరి నాటేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

తిరుపతి: ఆయన జిల్లా కలెక్టర్. అయితేనేమి పంట పొలాలను చూడగానే ఆయనకు ఉత్సాహం ఉప్పొంగింది. ఇంకేముంది వాహనం ఆపేసి పొలాల్లోకి దిగి వరి నాటేశారు.

ఈ ఘటన తిరుపతి సమీపంలో చోటు చేసుకున్నది. జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, ఏఎస్పీ రిషాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గిరిషా తో కలిసి పర్యటిస్తున్నారు. తిరుపతి సమీపం రాగానే ఆయన కు పంట పొలాలు కన్పించాయి. అందరూ కలిసి అక్కడ దిగిపోయి కొద్ది సేపు అటూ ఇటూ తిరిగారు. ప్యాంట్లు పైకెత్తి పొలాల్లోకి దిగారు. కూలీల నుంచి వరి నాట్లను తీసుకుని నాటారు.

agriculture land

You might also like

Leave A Reply

Your email address will not be published.