FbTelugu

జిల్లా కలెక్టర్‌, ఎస్పీ సస్పెన్షన్

భోపాల్‌: గుణా జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ను సస్పెండ్ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గుణా జిల్లాలోని కాంట్‌ ప్రాంతంలో ఆక్రమణలను తొలగించడానికి వెళ్లిన పోలీసులు ఓ రైతు దంపతులను కర్రలతో చితకబాదారు. ఈ ఘటన తర్వాత మనస్థాపానికి గురైన రైతు దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి వారిని కాపాడారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గుణా జిల్లా కలెక్టర్, ఎస్పీని వెంటనే సస్పెండ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.

You might also like