FbTelugu

పేద బ్రాహ్మణులకు బియ్యం పంపిణీ

గజ్వేల్: ఉపాధి లేక ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణులకు ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

గజ్వేల్ ఐఓసీ భవన్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు.  కరోనా వైరస్ గురించి బ్రాహ్మణులు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని సూచించారు.

ప్రతి ఒక్క రేషన్ కార్డు వినియోగదారునికి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం రూ.1500లు బ్యాంకులో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ ఏరియా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి పాల్గొన్నారు.

You might also like