FbTelugu

ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా

తాడేపల్లి: ఏపీలో ఈనెల ఎనిమిదో తేదీన పంపిణీ చేయాల్సిన పేదలకు ఇళ్ల పట్టాల కార్యక్రమం కరోనా ఎఫెక్ట్ కారణంగా వాయిదా వేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవం అయిన ఆగస్టు 15 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నివాసం లేని ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాను అందచేయాలని వైఎస్.జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భూములు సేకరించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో సేకరించిన భూములను ఇళ్ల పట్టాలకు కేటాయించారు. దీనిపై ఆ ప్రాంత రైతులు భగ్గుమంటున్నారు. రాజధాని కోసం తమ భూములు ఇస్తే, పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరుకు దూరంగా భూములు సేకరించారని, అంతగా ప్రయోజనం లేదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

You might also like