FbTelugu

ఏపీలో దిక్కుతోచ‌ని విప‌క్షాలు!

 

ఢిల్లీలో జ‌గ‌న్ ఉంటే.. ప‌వ‌న్ క‌ర్నూలులో ఉద్య‌మం చేప‌ట్టాడు. చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర అంటున్నాడు. బీజేపీ నేత‌లు అమ‌రావ‌తి కోసం పోరాటం అంటూ ఉర‌క‌లు పెడుతున్నారు. వీటిలో ఏ ఒక్క‌టీ.. ఏపీ ప్ర‌జ‌లు త‌మ‌దిగా భావించ‌క‌పోవ‌టం ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు మింగుడు ప‌డ‌ని విష‌యం. ఏపీలో విప‌క్ష‌పార్టీలు వ్యూహం లేకుండా పోరాటం చేస్తున్నాయి. అస‌లు తాము దేనికోసం కోట్లాట‌కు దిగుతున్నామ‌నే క‌నీస సృహ‌ను మ‌ర‌చిన‌ట్టున్నాయి.

ఓ వైపు జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో పాల‌న‌.. ప్ర‌తీకారం రెండింటికీ ప‌ద‌ను పెట్టుకుంటూ ముంద‌డుగు వేస్తున్నాడు. ఎవ‌రిని విమ‌ర్శించ‌కుండా.. ఆ ప‌ని సీనియ‌ర్ల‌కు అప్ప‌గించి తాను మాత్రం సీబీఐ కేసులు.. రాష్ట్ర నిధుల వేట‌లో ఢిల్లీ వెంట ప‌రుగులు తీస్తున్నారు.

ఏపీ ప్ర‌జ‌ల‌ను కేవ‌లం ఎమోష‌న్‌గా ద‌గ్గ‌ర చేసుకోవ‌టం ద్వారా 2024 విజ‌యాన్ని సునాయాసం చేసుక‌వాల‌నే ప‌థ‌కంతో న‌డుస్తున్నాడు. లేక‌పోతే.. మూడు రాజ‌ధానులు, పోల‌వ‌రం, అమ‌రావ‌తి మార్పు వంటి కీల‌క నిర్ణ‌యాల‌ను ఏక‌ప‌క్షంగా తీసుకునే సాహ‌సం చేయ‌డంటూ వైసీపీ సీనియ‌ర్లు ఆత్మ‌విశ్వాసం వెలిబుచ్చుతున్నారు.

అమ‌రావ‌తి కేవ‌లం 29 గ్రామాల‌కే ప‌రిమితంగానే ఏపీ ఓట‌ర్లు భావిస్తున్నారు. ప‌క్క‌నే ఉన్న కృష్ణాజిల్లా ప్ర‌జ‌లు కూడా రాజ‌ధాని మార్పుపై స్పందించేందుకు ముందుకురావ‌ట్లేదంటే ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉంద‌నేది అర్ధ‌మ‌వుతుంది. అమ‌రావ‌తి కేవం క‌మ్మ‌వ‌ర్గానికి మేలు చేసేద‌నే భావ‌న‌ను వైసీపీ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ల‌టంలో విజ‌యం సాధించింది. అదే స‌మ‌యంలో టీడీపీను సీమ‌, ఉత్త‌రాంధ్ర వ్య‌తిరేక‌పార్టీగా ముద్ర‌వేయ‌టంలోనూ సానుకూల‌త సాధిస్తున్నారు. ఇటువంటి స‌మ‌యంలో చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు.

ప‌వ‌న్ కూడా ఐదేళ్లక్రితం జ‌రిగిన దారుణాన్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చి క‌ర్నూలులో ఉద్యమం లేవ‌దీశాడు. హైకోర్టు ఏర్పాటుకు సిద్ధ‌మైన క‌ర్నూలులో ఇదీ న్యాయ‌మంటూ కొత్త ప్ర‌శ్న లేవ‌నెత్తారు. ఇది నిజంగానే వైసీపీతోపాటు టీడీపీనూ ఇరుకున పెట్టే అంశంగానే సీమ ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఇక‌పోతే.. బీజేపీ కూడా అమ‌రావ‌తి, ఇంగ్లిషుమీడియం, అవినీతి అంశాల‌ను లేవ‌నెత్తినా.. కేంద్రం నుంచి మాత్రం వైసీపీ సానుకూల స్పంద‌న‌లు అందుకుంటుంది. మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లతో బీజేపీ, వైసీపీ ద‌గ్గ‌రైతే.. ఇప్ప‌టి వ‌ర‌కూ గ‌ర్జించిన క‌మ‌ల‌నాథుల గొంతులు పూర్తిగా మౌనం దాల్చాల్సిన ప‌రిస్థితి కూడా రావ‌చ్చు. బీజేపీతో స్నేహం చేస్తున్న జ‌న‌సేన‌కు ఇది ఊహించ‌ని షాక్ గానూ మార‌వ‌చ్చు.

ఇప్పుడే ప్ర‌జ‌ల త‌ర‌పున ఉద్య‌మ చేసేందుకు నానాయాగీ చేస్తున్న విప‌క్షాల‌కు మున్ముందు ఇంకెటువంటి గ‌డ్డు ప‌రిస్థితి ఉంటుంద‌నేది కూడా ప్ర‌శ్నార్ధ‌కంగా మారింద‌నే చెప్పాలి.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More