FbTelugu

వైసిపి ఎమ్మెల్యే పై క్రిమినల్ కేసుల ఎత్తివేత

అమరావతి: తెలుగుదేశం హయాంలో ఎవరిపైన అయినా క్రిమినల్ కేసులు ఎత్తివస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి గగ్గోలు పెట్టేది. అధికారంలోకి వచ్చిన వైసిపి ఇప్పుడు అదే పనిచేస్తున్నది.

ప్రభుత్వ విప్‌, వైసిపి ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భానుపై క్రిమినల్ కేసులు ఎత్తివేసింది. రాష్ట్ర హోం శాఖ కేసులు ఎత్తివేస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. సామినేని ఉదయ భాను నిందితుడిగా ఉన్న ప‌ది క్రిమినల్ కేసుల్ని తొలగించింది. జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కుమారుడు తెలంగాణలో పోలీసులపై 2019 జూలై లో దౌర్జన్యం చేసిన కేసు విచారణలో ఉంది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.