FbTelugu

‘దిశా’ పోస్టర్ రీలీజు అయ్యింది

వివాదస్పద, సంచలనం రేపిన ఘటనలను సీనిమా తీయడంతో రామ్ గోపాల్ వర్మది అందెవేసిన చెయ్యి. ఆయన చేయాలనుకునేది చెబుతాడు. చేసి చూపిస్తాడు కూడా.
రాష్ట్రంలో సంచలనం రేపిన వెటేరియన్ దిశా రేప్, హత్యపై సినిమా తీస్తానని వర్మ గతంలో ప్రకటించాడు. చెప్పిన ప్రకారంగానే ఆయన సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజు చేశాడు. ఇందులో స్కూటీ, నిందితుడు లారీలో పారిపోతుండడం, ఎన్ కౌంటర్ చేసేందుకు తుపాకులు గురిపెట్టడం దృశ్యాలు ఉన్నాయి. కాసర్ల అనురాగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

గతేడాది నవంబర్ 26న నలుగురు వ్యక్తులు బెంగళూరు-హైదరాబాద్ రోడ్డుపై ఒక చెక్ పోస్టు వద్ద వెటేరియన్ ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఆ తరువాత దారుణంగా చంపేశారు. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళా సంఘాలు నిలదీయంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.

గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకుని, విచారించి, ఘటనా స్థలానికి తీసుకువెళ్లగా పారిపోయేందుకు ప్రయత్నించడంతో నలుగురి నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. ఎన్ కౌంటర్ జరిగిన కొద్ది రోజులకు రామ్ గోపాల్ వర్మ నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు ఇంటికి వెళ్లి భార్యను కలిశాడు. అందరి నుంచి సమాచారం సేకరించిన వర్మ, చిత్రీకరణ కూడా పూర్తి చేశాడు. ట్రైలర్ ను 26న రిలీజు చేయనున్నట్లు ప్రకటించాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.