FbTelugu

హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్రయల్స్ నిలిపివేత

కరోనా వైరస్ నివారణకు నిర్వహిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్రయల్స్ ను నిలిపివేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది.

ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. కరోనా మరణాలు తగ్గించడంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రభావం చూపలేదని తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ పై మధ్యంతర నివేదికలు జారీ చేసింది. కొన్ని నెలల క్రితమే డబ్ల్యూహెచ్ఓ కరోనా రోగులకు క్లోరోక్విన్ వినియోగంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

You might also like