FbTelugu

డిశ్చార్జీ… మళ్ళీ కరోనా పాజిటివ్

శ్రీనగర్: కరోనా పాజిటివ్ సోకిన 12 మందికి హాస్పిటల్ లో చికిత్స చేశారు. చికిత్స తరువాత పరీక్షించగా నెగెటివ్ అని తేలడంలో ఇళ్లకు పంపారు. మళ్లీ పాజిటివ్ రావడంతో బాధితులు వణికిపోతున్నారు.

ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ హాస్పిటల్ లో చోటు చేసుకున్నది. శ్రీనగర్ లోని కూల్ డ్రింక్ దుకాణంలో పనిచేసే 12 మందికి కరోనా నిర్థారణ అయ్యింది. వీరిని వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయించారు. పూర్తి చికిత్స తరువాత పరీక్షించగా నెగెటివ్ వచ్చింది. డిశ్చార్జీ చేసే ముందు మరోసారి పరీక్ష నిర్వహించి వారందరినీ ఇళ్లకు పంపించారు.

ఇళ్లకు వెళ్లిన మూడు రోజుల తరువాత పాజిటివ్ అంటూ రిపోర్టులు వచ్చాయి. ఈ రిపోర్టులను చూసి వైద్యులు కంగుతిన్నారు. నిబంధనల ప్రకారమే పరీక్షలు నిర్వహించి పంపించామని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ఇళ్లకు వెళ్లిన వారు ఎవరెవరిని కలిశారు అనే దానిపై వైద్యులు, అధికారులు ఆదరా తీస్తున్నారు.

You might also like