FbTelugu

మిలియన్ ఫోన్లకు వాట్సప్ సేవలు నిలిపివేత

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ జనవరి 1 నుంచి మొబైల్ ఫోన్ వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నది. నూతన సంవత్సరం ప్రారంభం నుంచి మిలియన్ల కొద్దీ పాత ఫోన్లకు సేవలు నిలిపివేయనుంది.

ప్రతి ఏడాది పాత ఓఎస్ వెర్షన్ మొబైళ్లకు సేవలు నిలిపివేస్తున్నట్లుగానే ఈ సారి కూడా ఆ దిశగా వాట్సాప్ నిర్ణయం తీసుకున్నది. ఐ ఫోన్ వాడుతున్న వారికి ఐఓఎస్ 9 కన్నా పాత వెర్షన్ ఉన్నట్లయితే వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. అంటే ఐఫోన్ 4లో ఇకపై వాట్సాప్ పని చేయదన్న మాట. ఐఫోన్ 4ఎస్, 5, 5ఎస్, 5సీ, 6, 6ఎస్ వంటి ఫోన్లను ఐఓఎస్ 9కి అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్ కన్నా పాత వెర్షన్తో నడుస్తున్న వాటికి సేవలు లభించవు. అప్ డేట్ అయితే మాత్రం సేవలు అందుతాయి. మీ ఫోన్లకు ఓఎస్ అప్డేట్కు సపోర్ట్ చేయకపోతే వీలైనంత త్వరగా వాట్సాప్ డేటాను రికవరీ చేసుకోవడం మంచిదని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.