FbTelugu

మరో ఆరు వారాలు భారీ కేసులు… జాగ్రత్త!

హైదరాబాద్: తెలంగాణ లో మరో ఆరు వారాల పాటు కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు హెచ్చరించారు.

ఆసుపత్రులలో మంచాలు కూడా దొరకని పరిస్థితి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సహకరించకపోతే మహరాష్ట్ర మాదిరి తెలంగాణ రాష్ట్రం మారుతుందని ఆయన అన్నారు. ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. పాజిటివ్ సోకిన వారికి అవసరమైన సేవలు అందించేందుకు తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో మంచాలు, మందులు, వైద్యులు అందుబాటులో ఉన్నారని డాక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.