FbTelugu

పోలీసులపై ‘సింగం’ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

చెన్నై: తమిళనాడులో తండ్రీ కొడుకుల లాకప్ డెత్ నేపథ్యంలో పోలీసులపై సింగం సినిమా దర్శకుడు హరి గోపాలకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకెళితే.. జయరాజ్, బెన్నిక్స్ అనే తండ్రీ కొడుకులను స్థానిక పాతాంకుళంలో పోలీసులు అరెస్టు చేశారు.

లాకప్ లో వారిని తీవ్ర చిత్రహింసలు పెట్టడంతో వారు లాకప్ లోనే మృతి చెందారని ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఈ తరుణంలో దర్శకుడు హరి మాట్లాడుతూ.. తనకు పోలీసులంటే ఎంతో గౌరవం ఉండేదని.. వారి గురించి ఎంతో గొప్పగా ఎన్నో సినిమాలు తీశానని.. కానీ ఇప్పుడు అలా తీసినందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు తీయబోనని అన్నారు.

You might also like