FbTelugu

రెండో కంగనా గురించి తెలియదు: డైరెక్టర్ అనురాగ్

ముంబై: బాలీవుడ్ పై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్న నటీమణి కంగనా రనౌత్ పై డైరెక్టర్ అనురాగ్ బసు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురిపై విమర్శలు చేసి వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్నది.
గ్యాంగ్ స్టర్ సినిమాతో కంగనాను బాలీవుడ్ కు పరిచయం చేసిన డైరెక్టర్ అనురాగ్ తాజాగా ఆమె ప్రవర్తనపై ఆలోచింప చేసే విధంగా మాట్లాడారు.

గ్యాంగ్ స్టర్ సినిమా కోసం అప్పట్లో సుమారు 25 మంది యువతులు వచ్చారు. వారిలో కంగనా తన పాత్రకు సరిపోవడంతో ఎంపిక చేసుకన్నాను. చిత్రీకరణ సందర్భంగా ఎలాంటి అనుమానాలు ఉన్నా వెంటనే నన్ను అడిగి తెలుసుకునేదని గుర్తు చేసుకున్నారు. ఆమె మరింతగా ఎదుగుతుందని ఆ రోజుల్లోనే గుర్తించానన్నారు. ఆ తరువాత కలుసుకోలేదని, కలిసినప్పుడు మాత్రం సరదగా మాట్లాడుతుందన్నారు.
అయితే అప్పటికీ ఇప్పటికీ ఆమెలో చాలా తేడా ఉందన్నారు. వ్యక్తిగతంగా తనకు కంగానా వేరు, ఇప్పటి కంగనా వేరు అని అన్నారు. రెండో కంగనా రనౌత్ గురించి తనకు తెలియదని అనురాగ్ వ్యాఖ్యానించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.