అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో పంచాయతి ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన, ఇద్దరు కలెక్టర్లు, ఓ ఎస్పీపై ఎస్ఈసీ వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో గుంటూరు జిల్లాకు దినేష్ కుమార్ఇన్చార్జ్ కలెక్టర్గా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.
శామ్యూల్ ఆనంద్ స్థానంలో దినేష్ కుమార్కు బాధ్యతలను ఎస్ఈసీ అప్పగించింది. కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన దినేష్ కుమార్కు జిల్లా అధికార యంత్రాంగం అభినందనలు తెలియజేసింది. పంచాయతి ఎన్నికల నేపథ్యంలో తొలి విడత ఎన్నికల సిబ్బందికి కలెక్టరేట్లో శిక్షణ ఇస్తున్నారు.