నిజామాబాద్: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు అలియాస్ వి.వెంకటరమణా రెడ్డి ఆదివారం రాత్రి ద్వితీయ వివాహం చేసుకున్నారు.
నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లిలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దిల్ రాజు (49), ఏయిర్ హోస్టెస్ తేజస్విని మెడలో మూడు ముళ్లు వేశారు.
దిల్ రాజు భార్య అనిత అనారోగ్యంతో 2017లో మరణించింది. ఇక అప్పటి నుండి ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరి అయిన ఆయనకు బంధం చూసేందుకు బరువైన ఆ బాధ్యతను కుమార్తె హన్సితా రెడ్డి భుజాన వేసుకొని పెళ్లి పెద్దగా వ్యవహరించింది. బ్రాహ్మణ కులానికి చెందిన ఏయిర్ హోస్టెస్ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడంతో ఇరువైపులా అంగీకారం తెలిపారు. బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గుడిలో పెళ్లి తంతు పూర్తయింది.