FbTelugu

ఐ.ఆర్.సి.టి.సి లో మార్పులు.. ప్రయాణీకులకు ఊరట

న్యూఢిల్లీ: ఐ.ఆర్.సి.టి.సి తన వెబ్ ఫోర్టల్ తో పాటు యాప్ లో అనేక మార్పులు తీసుకువచ్చింది. ప్రయాణీకుల ఇబ్బందులు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని సులభతరం చేసింది.

యాప్ లేదా వెబ్ సైట్ లో రైలు టికెట్ బుక్ చేసిన తరువాత ప్రత్యేక పరిస్థితుల్లో రద్దు చేస్తే ఆ డబ్బుల కోసం మూడు నాలుగు రోజులు పట్టేది. ఇక నుంచి ఐ.ఆర్.సి.టి.సి-ఐ పే గేట్ వే ద్వారా టికెట్లు బుక్ చేస్తే రద్దయిన వెంటనే టికెట్ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భగంగా ఐ పే ను 2019లో ప్రారంభించింది. పేరుగుతున్న ప్రయాణీకులు, ఇబ్బందులు లేని సేవకల కోసం వెబ్ సైట్ ఇంటర్ ఫేస్ ఆధునీకరించామని, దీని వల్ల టికెట్ ను తక్కువ సమయంలో బుక్ చేసుకోవచ్చని ఐ.ఆర్.సి.టి.సి అధికార ప్రతినిధి తెలిపారు. ఆధునీకరణ తరువాత ప్రయాణీకులు తత్కాల్, సాధారణ టికెట్లు సులభంగా పొందవచ్చని వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.