FbTelugu

ఎప్పుడైనా ఈ పాస్ తప్పనిసరి: డిఐజి రంగనాథ్

నల్లగొండ: లాక్ డౌన్ మినహాయింపు సమయంలోనూ అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తామని డిఐజి రంగనాధ్ స్పష్టం చేశారు. తెలంగాణ, ఏపి ప్రభుత్వం లేదా ఎపి, తెలంగాణ పోలీసులు జారీ చేసిన పాస్ ఉంటేనే అనుమతిస్తారన్నారు.

అంబులెన్సులకు ఎలాంటి ఆంక్షలు లేవని, ప్రైవేట్ వాహనాలలో ఆంధ్రా నుండి తెలంగాణకు వచ్చే కరోనా, ఇతర రోగులు ఆస్పత్రుల నుండి ఇచ్చిన లెటర్స్, సంబంధిత పత్రాలు ఉంటేనే తెలంగాణలోకి ప్రవేశం ఉంటుందన్నారు. లాక్ డౌన్ మినహాయింపు సమయం ఉదయం 6.00 నుండి 10.00 గంటల వరకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలు విధిగా ఈ పాస్ కలిగి ఉండాలన్నారు. ఆంధ్రా నుండి తెలంగాణలోకి వచ్చే వారు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఈ పాస్ లేకుండా వచ్చి ఇబ్బందులు పడవద్దని రంగనాథ్ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.