FbTelugu

జగన్ అరెస్టుపై ఎబి ఒత్తిడి తెచ్చారు: డిఐజి పాల్ రాజ్

విజయవాడ: ఇంటెలిజెన్స్ చీఫ్ గా నాడు ఎబి.వెంకటేశ్వర రావు కనుసన్నల్లోనే మాజీ ఎంపి వైఎస్ వివేకానందరెడ్డి హత్య దర్యాప్తు జరిగిందని డిఐజి పాల్ రాజ్ ఆరోపించారు.
ఎబి.వెంకటేశ్వర రావు ఇచ్చే సమాచారంతోనే నాడు సిఎం ఎన్.చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడేవారన్నారు. తన వద్దనున్న సమాచారాన్ని.. ఆనాడే సిట్కుడ ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. దర్యాప్తు సమాచారాన్ని వెంకటేశ్వర రావు అందివ్వకపోవడం తప్పు కాదా? అన్నారు. ఆధారాలు లేకున్నా జగన్ కుటుంబ సభ్యులు, బంధువులను అరెస్టు చేయాలని దర్యాప్తు అధికారి రాహుల్ దేవ్పైభ ఆయన ఒత్తిడి తెచ్చింది వాస్తవం కాదా? ప్రశ్నించారు. రాహుల్ దేవ్ నిబద్దత గల అధికారి కాబట్టి ఆయన ఒత్తిళ్లకు తలొగ్గలేదని డిఐజి పాల్ రాజ్ అన్నారు.

కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ వివరాలను మీడియాకు వెల్లడించడం సమంజసం కాదని ఖండించారు. పోలీసు ఉన్నతాధికారులు కొందరు ఆయనపై కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారన్న ఆరోపణలు నిరాధారమన్నారు. సహచర అధికారులపై వెంకటేశ్వర రావు ఆరోపణలు సరికాదన్నారు. సర్వీస్ రూల్స్ కు విరుద్దంగా ఆయన వ్యవహరించారన్నారు. పోలీసు శాఖలో డిజి హోదాలో ఉన్న ఎబి వెంకటేశ్వర రావు ఇలా వ్యవహరించడం సరికాదు డిఐజి పాల్ రాజ్ హితవు పలికారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.