FbTelugu

కష్టనష్టాలను ఈ ఏడాదిలో అధిగమించాలి: చంద్రబాబు

అమరావతి: గత 2020 సంవత్సరం కలిగించిన బాధలు, కష్టాలు, నష్టాలు అన్నింటినీ ఈ కొత్త సంవత్సరంలో అధిగమించాలని టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత 2020 సంవత్సరం కలిగించిన బాధలు, కష్టాలు, నష్టాలు అన్నింటినీ ఈ కొత్త సంవత్సరంలో అధిగమించి… మీ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలను, ఆరోగ్య ఐశ్వర్యాలను, విజయాలను అందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.’’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.