FbTelugu

టీఆర్ఎస్, బీజేపీ మధ్య తేడా 0.25 శాతమే

హైదరాబాద్: గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒక్కసారిగా పుంజుకుంది. పోలైన ఓట్లలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య తేడా 0.25 శాతమే ఉండడం గమనార్హం. విజయం అత్యంత సునాయసంగా భావించిన టీఆర్ఎస్ పార్టీకీ ఒక స్థాయిలో కమలం చుక్కలు చూపించింది. హైదరాబాద్ మేయర్ పదవి టీఆర్ఎస్ కు దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నప్పటికీ..

టీఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బ అనే పలువురు భావిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీలకు పోలైన ఓట్లలో 8,456 ఓట్ల తేడానే ఉంది. టీఆర్ఎస్ కు 12,04,167 (35.81%) ఓట్లు రాగా.. బీజేపీకి 11,95,711 (35.56) ఓట్లు వచ్చాయి. 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 43.85 శాతం ఓట్లు రాగా.. బీజేపీకి 10.34 శాతం ఓట్లే వచ్చాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.