FbTelugu

రేపటి నుంచి ఢిల్లీలో జనరేటర్లు బంద్

ఢిల్లీ: కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాయు కాలుష్య నివారణ కోసం గురువారం నుంచి డీజిల్ జనరేటర్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది.

డీజిల్, పెట్రోల్, కిరోసిన్ తో నడిచే అన్ని రకాల జనరేటర్లను అక్టోబర్ 15 నుంచి నిషేధిస్తున్నట్లు మండలి పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కాగా అత్యవసర సేవల విభాగంలో ఉపయోగించే వాటికి మినహాయింపు నిచ్చారు. మెట్రో రైలు, హెల్త్ సర్వీసెస్, రైల్వే, విమానాశ్రయాలు, బస్ టెర్మినల్స్ ను అత్యవసర సేవల పరిధిలో ఉన్నాయి.  గ్రేడెడ్ రెస్సాన్స్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈ ఆదేశాలు జారీ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.