FbTelugu

జలపాతంలో సెల్ఫీ తీసుకుంటూ మృతి

కొలంబియా: సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్న పోలవరపు కమల జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు కాలుజారి పడి చనిపోయింది.
శనివారం నాడు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద ఆగారు.

జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా జలపాతంలో పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. నాట్స్ సంస్థ సహకారంతో ఆమె మృతదేహాన్ని ఏపీకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరకు లక్ష్మణ రావు, అరుణ దంపతుల రెండో కుమార్తె కమల (26) ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లింది. ఎంఎస్ పూర్త అయిన తరువాత కొలంబియాలో స్థిరపడి ఉద్యోగం చేస్తున్నది.

You might also like