FbTelugu

ఈటలకు స్పీకర్ నుంచి పిలుపు రాలేదు!

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన రాజీనామా సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం నుంచి ఇంకా అప్పాయింట్ రాలేదు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని కలిసి స్వయంగా రాజీనామా పత్రం అందచేయాలని ఆయ నిర్ణయించుకున్నారు. ఈ విషయమై ఈటల స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి కి మొబైల్ ఫోన్ లో చెప్పగా, తాను కరోనా కారణంగా కార్యాలయానికి రావడం లేదని తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత అప్పాయింట్ మెంట్ ఇస్తామని చెప్పారు.

లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపురాని పక్షంలో ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖ ను పంపించాలనే యోచనలో ఈటల రాజేందర్ ఉన్నారు. ఈటల రాజీనామా సమర్పించిన వెంటనే రంగంలోకి దిగేందుకు మంత్రులు సిద్ధంగా ఉన్నారు. హుజూరాబాద్ ఇన్ ఛార్జీలుగా మంత్రులు టి.హరీశ్ రావు, గంగుల కమాలాకర్, కొప్పుల ఈశ్వర్ వ్యవహరిస్తున్నారు. తొలుత నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, మండలాలు, గ్రామాల వారీగా పర్యటించే అవకాశం ఉంది. ఉప ఎన్నికల షెడ్యూలు వరకు మంత్రులు ప్రచార బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.