FbTelugu

ఏమండోయ్‌.. ఇది తెలుసా..!

కరోనా కాలం కొన్నింటి డిమాండ్‌ను భారీగా పెంచింది. కొవిడ్‌ ప్రభావంతో అనేక రంగాలు, వ్యాపారాలు బాగా తగ్గిపోయాయి. కానీ, ఇంటర్నెట్‌ సేవలు మాత్రం భారీగా పెరిగాయి. కరోనా కాలంలో ప్రజలు ఎక్కువగా దీనిని వాడుకున్నారట. కోవిడ్‌ –19, లాక్‌డౌన్‌ కారణంగా డేటాకు డిమాండ్‌ పెరిగిందిట. అది కూడా మామూలు స్థాయిలో కాదు.

మార్చి నుండి జూలై మధ్య వరకు డేటా వినియోగం 947 శాతం పెరిగిందట. డేటా వినియోగం ఎక్కువగా ఓటీటీ, వీడియో అనగా వీఓడీ ప్లాట్‌ఫామ్‌లలో ఉంది. ఇంటి వద్ద ఉన్న వ్యక్తులు మొబైల్‌ లేదా సిస్టమ్‌లో ఎక్కువ డేటాను ఉపయోగిస్తున్నారట. ఫ్రాంక్‌ఫర్ట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ ఎక్చేంజ్ ప్రకారం, మార్చి– ఏప్రిల్‌ మధ్య కాలంలో ఓటీటీ , వీడియోలలో 249% డేటా వినియోగం పెరిగింది. అంటే 2020 ఫిబ్రవరితో పోలిస్తే వీఓడీ ప్లాట్‌ఫాంలు ఎక్కువగా వాడుతున్నారు.

అదే సమయంలో డేటా వినియోగానికి డిమాండ్‌ మార్చి నుండి జూలై వరకు 947 శాతం పెరిగింది. నోకియా వార్షిక మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ట్రాఫిక్‌ ఇండెక్స్‌ (ఫిబ్రవరి 2020) నివేదిక ప్రకారం, వినియోగదారులు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రోజుకు సగటున 70 నిమిషాలు గడుపుతున్నారట. టెలికాం పరికరాలను తయారుచేసే ప్రధాన సంస్థ ఎరిక్సన్‌ మొబిలిటీ రిపోర్ట్‌ ప్రకారం, భారతదేశంలో తలసరి నెలవారీ డేటా వినియోగం 2025 నాటికి నెలకు 25 జీబీకి చేరుకోనుందట. చూశారా.. కరోనా కాలంలో ఇంటర్నెట్‌ సేవలకు ఎంతగా ఆదరణ పెరిగిందో. మున్ముందు ఇది ఇంకా పెరిగే అవకాశాలున్నాయని ఇంటర్నెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

You might also like