FbTelugu

దిల్లీలో టీ20 మ్యాచ్ కు ఆక్సిజన్ అందేనా..?

Did-you-get-the-oxygen-for-the-T20-match-in-Delhi

దిల్లీ: బంగ్లాదేశ్‌, భారత్ మధ్య అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఆదివారం జరుగనున్న తొలి టీ20 మ్యాచ్‌ను వాయు కాలుష్యం భయపెడుతోంది. చివరి నిమిషంలో మ్యాచ్‌ను మరో వేదికకు మార్చాలనుకున్నపటికీ అది సాధ్యం కాకపోవడంతో భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లు ఇక్కడ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాయి. తొలి టీ20కి వాయు కాలుష్య ప్రభావం ఆటగాళ్లపై పెద్దగా ప్రభావం చూపదని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిప్రాయపడగా, బంగ్లాదేశ్‌ కోచ్‌ డొమింగో కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదన్నాడు. మ్యాచ్‌కు సంబంధించి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో మాట్లాడిన రోహిత్‌ శర్మ మాత్రం వాయు కాలుష్యంతో ఇబ్బందేమీ ఉండదన్నాడు. తామంతా మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. ఇక బంగ్లాదేశ్‌ కోచ్‌ డొమింగో మాట్లాడుతూ.. వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ ప్రాణాలు పోయేంత కష్టమేమీ లేదన్నాడు. ఇది కేవలం మూడు గంటల ఆటే కావడంతో మ్యాచ్‌ సజావుగా సాగుతుందని పేర్కొన్నాడు.

You might also like