FbTelugu

అంబానీని పంజాబ్ సీఎం కలిశారా?

చండీఘడ్: వ్యవసాయ చట్టాలపై రైతులు ఉద్యమం చేస్తున్న తరుణంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోపై అటు రైతులు, ఇటు రాజకీయ నాయకులు తెగ చర్చించుకుంటున్నారు.

వైరల్ గా మారిన ఈ ఫోటో కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భారత్ బంద్ కు ఒకరోజు ముందు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ని పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్ కలిసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇది చూసిన పలువురు అవాక్కయ్యారు. వ్యవసాయ చట్టాలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తుండగా, సీఎం అమరీందర్ పెట్టుబడుల కోసం కలిశారంటూ విమర్శలు మొదలు పెట్టారు.
ఈ వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. 2017లో ముకేశ్ ను అమరీందర్ సింగ్ కలుసుకున్నారు. ఆ ఫొటోను తన ట్విట్టర్ ఖాతా నుంచి సీఎం పోస్టు చేసి, ముకేశ్ ను కలస్తున్నందుకు ఆనందగా ఉందని, పంజాబ్ లో పెట్టుబడులు, అభివృద్ధి గురించి చర్చిస్తానన్నారు. అప్పటి పాత ఫొటోను కొందరు ఇలా వాడుకుని ఆయన ప్రతిష్టకు మచ్చతెచ్చే ప్రయత్నం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.