FbTelugu

ఏపి ప్రభుత్వం దివాళా తీసిందా?: హైకోర్టు ఆగ్రహం

అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు నిధులు లేవని చెప్పడంపై హైకోర్టు మండిపడింది. సకాలంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోతే 3 రాజధానుల నిర్మాణానికి ఎవరు ముందుకు వస్తారని ప్రశ్నించింది.

ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులను హైకోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. 2018-19 ఆర్థిక సంవత్సరలో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించలేదంటూ చిత్తూరు, తూ.గో జిల్లాకు చెందిన యర్రంరెడ్డి, ఆర్.శ్రీనివాసరావు లు హైకోర్టును ఆశ్రయించారు. నిధులు లేక బిల్లులు చెల్లించలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా అయితే ఉద్యోగులు జీతాలు ఎలా చెల్లిస్తారు, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని నిలదీసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.