FbTelugu

కరోనాపై జగన్ చేతులెత్తేశాడా…?!

తాడేపల్లి: ఏపి సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి కరోనా సెకండ్ వేవ్ మహమ్మారిపై చేతులెత్తేశాడా అంటే అవుననే విధంగా వైసిపి ముఖ్యనేతలు చర్చించుకున్నారు. వైసిపి నేతలు మాట్లాడుకున్న ఈ సీక్రెట్ వీడియో వైరల్ అయ్యింది.
రాజమహేంద్రవరంలో వైసిపి ఎంపిలు, ముఖ్య నేతలు సమావేశమైన సందర్భంగా సెకండ్ వేవ్ తీవ్రత, జగన్ వైఖరిపై చర్చించుకున్నారు. కరోనా పాజిటివ్ సోకి చనిపోతే వారి మృతదేహాలను ఆసుపత్రి నుంచి ఇళ్లు లేదా స్మశాన వాటికకు తరలించేందుకు రూ.30వేలు తీసుకుంటున్నారని ఒక నేత అన్నారు.

దహన సంస్కారాలకు కూడా రూ.12వేలు తీసుకుంటున్నరాని, ఇంత దారుణమా అని అన్నారు. ఈ 12వేల రూపాయల కోసం పేద కుటుంబాలు జోలె పట్టి డొనేషన్లు వసూలు చేసుకుని దహన సంస్కరాలు చేసుకుంటున్నాయని అన్నారు. రూ.3వేలతో అయ్యే దహన సంస్కారాలకు అంత మొత్తం వసూలు చేయడం అమానుషమన్నారు. జగన్ చేసింది బొక్క అంటూ ఒక రాజ్యసభ సభ్యుడు ఆగ్రహం వెళ్లగక్కారు. సిఎం మొండి వైఖరి, అహంకారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు చర్చించుకున్నారు.

rajamahendravaram

 

You might also like

Leave A Reply

Your email address will not be published.