FbTelugu

19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్ కేంద్రాలు: కెసిఆర్

హైదరాబాద్: తొలి విడతగా రాష్రంలో 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్ కేంద్రాలను ఈ నెల 7వ తేదీన ప్రారంభించాలని సిఎం కెసిఆర్ వైద్య ఆరోగ్య శాఖ ను ఆదేశించారు. రోగం కన్నా పరీక్షల ఖరీదు ఎక్కువైందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవాళ ప్రగతి భవన్ లో వైద్య ఆరోగ్యంపై కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఉచిత వైద్యం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నామని, ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సిఎం అన్నారు. నూతనంగా ప్రారంభిస్తున్న డయాగ్నస్టిక్ కేంద్రాల్లో 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారన్నారు. ఈ పథకానికి త్వరలోనే ఒక పేరు పెడతామని సిఎం కెసిఆర్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.