ముంబయి: ఇటీవలే ద్వితీయ వివాహం చేసుకున్న హీరోయిన్ దియా మీర్జా గర్భంతో ఉన్నది. అయితే తనకు వివాహానికి ముందే గర్భం వచ్చిందని ఆమె వెల్లడించింది.
తొలుత నిర్మాత సాహిల్ సంఘాను వివాహం చేసుకున్న దియా మీర్జా ఐదేళ్లకు విడిపోయింది. గత నెలలో బిజినెస్ మెన్ అయిన వైభవ్ రేఖిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
పెళ్లికి ముందే వైభవ్ రేఖితో తనకు గర్భం వచ్చిందని, బిడ్డ పుట్టబోతున్నదని పెళ్లి చేసుకోలేదని సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటించింది. వివాహ బంధంతో ఒక్కటవ్వాలని ఎప్పటి నుంచో ప్రణాళికలు రచించుకుంటున్నామని చెప్పింది. ఈ విషయాన్ని వివాహానికి ముందే ప్రకటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా వెల్లడించలేదన్నారు. నిజానికి నా జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం ఇది అని దియా మీర్జా వెల్లడించింది. ఇలాంటి ఒక రోజు కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది.