FbTelugu

అభిమాని భైక్ పై ధోనీ ఆటోగ్రాఫ్

Dhoni-autograph-on-fan-bhaik

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ తన అభిమానిని ఆశ్చర్యపరిచాడు. తనకు ఆటోగ్రాఫ్‌ ఇవ్వమని అభిమానిని కోరగా అభిమాని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై ధోనీ సంతకం చేశాడు. ఓ వ్యక్తి ఆ సన్నివేశాన్ని వీడియోతీసి ట్వీట్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. అందులో ధోనీ బైక్‌ ఫ్యుయల్‌ టాంక్‌పై సంతకం చేస్తుండగా అభిమాని సంతోషంగా కనిపించాడు. టీమిండియా ప్రపంచకప్‌లో సెమీస్‌ నుంచి నిష్క్రమించాక ధోనీ తిరిగి జట్టులోకి రాలేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు సందర్భంగా రాంచీలో టీమిండియా ఆటగాళ్లను కలిశాడు.

You might also like