FbTelugu

ప్రేమపెళ్లి… శోభనం… పరారీ!

బెంగళూరు: ఒక యువతి తనకు న్యాయం చేయాలని పోలీసు స్టేషన్‌ ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగింది. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హొసకోటె తాలూకా నందగుడికి చెందిన ప్రమోద్ సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
అదే గ్రామానికి చెందిన అనూజా, ప్రమోద్ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో వీరిద్దరి పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించలేదు. ప్రేమించుకున్న వీరు ఎలాగైనా సరే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

గతనెల 19న యలహంక సమీపంలోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపస్‌లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఆమె క్యాంపస్ లోనే కాపురం పెట్టాడు. శోభనం అయిన మూడు రోజుల తరువాత ప్రమోద్ కన్పించకుండా వెళ్లిపోయాడు. అతని ఫోన్‌ కూడా స్విచాఫ్‌ చేసి పెట్టడంతో పాటు మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకున్నది. తనకు న్యాయం చేయాలంటూ అనూజ నందగుడి పోలీసు స్టేషన్‌ ఎదుట కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ స్టేషన్ ముందే బైఠాయించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.