FbTelugu

విద్యార్థి మృతదేహంతో రోడ్డుపై ధర్నా

గుంటూరు: ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థి అనూష మృతదేహంతో నరసరావుపేటలో బంధువులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఏడు గంటలుగా వారు రోడ్డుపైనే మృతదేహం తో న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు.
పోలీసులు ఎంతగా నచ్చచెప్పినా కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడి నుంచి కదలకుండా కూర్చుండిపోయారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష నరసరావు పేట లోని డిగ్రీ కాలేజీలో చదువుతోంది. అదే కాలేజీలో బొల్లపల్లి మండలం పమిడిపాడుకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి చదువుతున్నాడు.

కొద్ది నెలలుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు. ఈ మధ్య మరో యువకుడితో చనువుగా ఉంటున్నదని విష్ణు అనుమానం పెంచుకున్నాడు. ఇవాళ మాట్లాడుకుందా రమ్మంటూ అనూష ను పిలిపించి ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విష్ణువర్ధన్ రెడ్డి అనూష గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. చనిపోయిందని నిర్థారించుకున్న తరువాత నేరుగా నరసరావుపేట రూరల్ పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
నరసరావుపేటలో హత్యకు గురైన కోట అనూష తల్లితండ్రులను ఎమ్మెల్సీ నారా లోకేష్ ఫోన్లో పరామర్శించారు. హోంమంత్రి సొంత జిల్లాలో మహిళలకు కనీస రక్షణ లేకపోవడం బాధాకరం అన్నారు. మృగాడు విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ కార్యకర్త కావడంతో ప్రభుత్వం నుండి స్పందన కరవైందన్నారు. న్యాయం కోసం అనూష తల్లితండ్రులు చేస్తున్న పోరాటానికి టిడిపి అండగా ఉంటుందన్నారు. అనూష కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. అనూషను అత్యంత దారుణంగా హత్య చేసిన విష్ణువర్ధన్ రెడ్డి కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.