FbTelugu

ఎల్జీ పాలిమర్స్ ముందు స్థానికుల ధర్నా

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ముందు ఆర్ఆర్ వెంకటాపురం గ్రామానికి చెందిన ప్రజలు ధర్నాకు దిగారు.

సీఎం జగన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో వెంకటాపురం గ్రామస్తులకి అవకాశం కల్పించలేదని వారు ఆరోపించారు. గ్యాస్ లీకేజ్ అయినందున వెంకటాపురం గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని, టెంపరరీ ఉద్యోగస్తులకు వెంటనే పర్మినెంట్ చేయాలని నినాదాలు చేశారు.

ఇకనుంచి గ్రామస్తులకే ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెంటనే నిర్మించాలన్నారు. ప్రతి కుటుంబానికి 2 నెలల కు సరిపడా నిత్యావసర సరుకులు కంపెనీ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ లీకేజీ ఘటనలో వెంకటాపురం గ్రామమే ఎక్కువగా నష్టపోయిందని, ఆస్తి నష్టం,  ప్రాణ నష్టం మా గ్రామానికే అధికంగా జరిగిందన్నారు. మిగతా గ్రామాలతోపాటు మా గ్రామాన్ని సమానంగా చూడటం భావ్యం కాదని మహిళలు శాపనార్థాలు పెట్టారు.

You might also like