FbTelugu

టిటిడి తాత్కాలిక ఈఓగా ధర్మారెడ్డి

అమరావతి: టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి కు కోవిడ్ నియంత్రణ బాధ్యతలు అప్పగిస్తూ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు.
టిటిడి అదనపు ఈఓ ఏవి.ధర్మారెడ్డి కి తాత్కాలికంగా ఈఓ బాధ్యతలు అప్పగించింది.

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పూర్తి బాధ్యతలు చూడాలంటూ జవహర్ రెడ్డిని ఆదేశించింది. తాడేపల్లి లో ఉండే స్టేట్ కమాండ్ కంట్రోల్ నుండే విధులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ఏవి.ధర్మారెడ్డి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసు (ఐడిఈఎస్) 1991 బ్యాచ్ అధికారి. డెప్యూటేషన్ పై టిటిడిలో విధులు నిర్వర్తిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.