FbTelugu

మసీదు శంకుస్థాపనకు ఆహ్వానిస్తాం…

లక్నో: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ ను ధన్నీపూర్ మసీదు శంకుస్థాపన కార్యక్రమానికి కచ్చితంగా ఆహ్వానిస్తామని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ స్పష్టం చేసింది. మసీదు శంకుస్థాపన పిలుపుపై రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
తనను శంకుస్థాపనకు ఆహ్వానించరు అని, ఒక వేళ ఆహ్వానించినా వెళ్లేది లేదని సీఎం యోగి రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని ధన్నీపూర్ లో మసీదు నిర్మాణం కోసం ప్రత్యేక స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. అయోధ్య రామ మందిరానికి 25 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మాణం చేస్తున్నారు.

ఇందులో ఒక ఆసుపత్రి, గ్రంథాలయం, కిచెన్, అధ్యయన కేంద్రం నిర్మిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొనడమేకాకుండా ప్రజల సౌకర్యం కోసం నిర్మించే వాటికి ఆర్థిక సహాయం అందిస్తారని ఆశిస్తున్నామని ఫౌండేషన్ అధికార ప్రతినిధి అథర్ హుస్సేన్ తెలిపారు. అయితే దీనికి బాబ్రీ మసీదు అని నామకరణం చేస్తారా అని ఆయనను ప్రశ్నించగా పేర్లకు అంత ప్రాముఖ్యం లేదని, మసీదు మాత్రమే ముఖ్యమన్నారు.

You might also like