FbTelugu

డీజీపీవి దిక్కుమాలిన చర్యలు: బండి సంజయ్

* కేసీఆర్ స్క్రిప్టునే చదువుతున్నాడంటూ ఫైర్

   హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్క్రిప్ట్ నే డీజీపీ మీడియా ముందు చదువుతున్నాడని.. అది ఒక దిక్కుమాలిన చర్య అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సజయ్ అన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నిర్వహిస్తున్న ప్రచారంలో పాల్గొని ప్రభుత్వంపై, డీజీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

హైదరాబాదులో మతకలహాలను రేకెత్తించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం ఉందని డీజీపీ చెపుతున్నారని.. సమాచారం ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. బీజేపీపై అనవసర నిందలు వేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని, ఆ పాచికలేమీ సాగవని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.