FbTelugu

సోషల్ మీడియా పోస్టులపై డీజీపీ హెచ్చరికలు

హైదరాబాద్: యువవ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే గంటల తరబడి సోషల్ మీడియాలను వినియోగిస్తుంటారు. తమ ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగులు పెడుతుంటారు. కానీ.. అలా చేసేవారికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

తప్పుడు పోస్టింగులతో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. తాజాగా బెంగుళూరులో ఫేస్ బుక్ లో ఒక్క పోస్టింగ్ రేపిన వివాదంతో ముగ్గురు మృతి చెందగా.. 60 మందికి తీవ్రగాయాలైనాయి. ఆస్తి, ప్రాణ నష్టం జరగడంతో.. వీటిని దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలను దెబ్బతీసే పోస్టులు చేయవద్దని, వారిపై కఠిన చర్యలు తప్పవని డీజీపి నెటిజెన్స్ ని హెచ్చరించారు.

You might also like