FbTelugu

శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ సవాంగ్

తిరుమల: ఏపీ డైరెక్టర్ జనరల్ ఆప్ పోలీసు (డీజీపీ) గౌతం సవాంగ్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఇవాళ ఉదయం సీనియర్ ఐపీఎస్ అధికారి ఏఆర్.అనురాధ తో కలిసి ఆయన ఆలయానికి రాగా టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన కు రంగనాయకుల మంటపంలో అర్చరకులు ఆశీర్వదించారు. తరువాత  తిరుమల ప్రసాదం, స్వామి ఫొటోను బహూకరించారు. రాష్ట్రంలో వరుసగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుండడం, ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

రాష్ట్రంలో సీఎం జగన్ రెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ ఐజీ సునీల్ కుమార్ లు క్రిష్టియన్లేనని, వారి వల్ల హిందువులకు ఏం న్యాయం జరుగుతుందని ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ విమర్శల ధాటి నుంచి బయటపడేందుకు గౌతం సవాంగ్ తిరుమలను ఇవాళ దర్శించుకున్నారు.

ttd info

You might also like

Leave A Reply

Your email address will not be published.