FbTelugu

ఏపిలో ఈ పాస్ తప్పనిసరి: డిజిపి సవాంగ్

అమరావతి: కర్ఫ్యూ సమయంలో ఇతర రాష్ట్రాలు, అంతర్రాష్ట్ర జిల్లాలో ప్రయాణానికి తప్పనసరిగా ఈ పాస్ ద్వారా అనుమతి పొందాలని ఏపి డిజిపి గౌతం సవాంగ్ తెలిపారు.

సిటిజన్ సర్వీస్ పోర్టల్(http://appolice.gov.in), ట్విట్టర్(@ APPOLICE100), ఫేస్ బుక్(@ANDHRAPRADESHSTATEPOLICE)  ద్వారా ఈపాస్ పొందవచ్చునని ఆయన వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారు మాత్రమే పూర్తి ధృవ పత్రాలతో ఈ-పాస్ వినియోగించుకోవాలని కోరారు. శుభకార్యాలు, అంతక్రియలకు సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా సంబంధిత అధికారుల వద్ద సరైన గుర్తింపు పత్రాలతో అనుమతి పొందాలని కోరారు. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని, అంతరాష్ట్ర రాక పోకలపై నిబంధనలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయని డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.