FbTelugu

ఈ కామర్స్ సేవ‌లు యథాత‌థం: డిజిపి

హైదరాబాద్: రాష్ట్రంలో అత్య‌వ‌స‌ర రాక‌పోక‌లు సాగించేవారిని, అనుమతులు ఉన్నవారిని అడ్డుకోబోమ‌ని డిజిపి ఎం.మ‌హేంద‌ర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. నేటి నుంచి ఈ- కామ‌ర్స్‌, ఫుడ్ డెలివ‌రీ సేవ‌లు యథాత‌థంగా కొన‌సాగుతాయని అన్నారు.

హైద‌రాబాద్‌లో శనివారం నాడు ఉదయం 10 గంటల తరువాత పోలీసులు చెక్ పోస్టుల వద్ద ఫుడ్ డెలివ‌రీ బాయ్స్‌ ను అడ్డుకొని, కొంద‌రి వాహ‌నాల‌ను సీజ్ చేయడంతో వారు ఆందోళ‌న వ్యక్తం చేశారు. తాము కస్టమర్లకు ఫుడ్ డెలీవరీ చేస్తున్నామని, వదిలేయాలని పోలీసులను కోరినా విన్పించుకోకుండా కేసులు పెట్టారు. దీంతో డెలీవరీ సంస్థల యాజమాన్యాలు మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లారు. ఆయ‌న వెంటనే రంగ ప్రవేశం చేసి డిజిపి మహేందర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. అత్య‌వ‌స‌ర రాక‌పోక‌లు సాగించే వారిని అడ్డుకోవ‌ద్ద‌ని ట్వీట్ చేశారు.

మంత్రి కెటిఆర్ సూచ‌న‌తో డిజిపి మహేందర్ రెడ్డి మళ్ఈ తాజా ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ డెలివ‌రీ, ఈ- కామ‌ర్స్ సేవ‌ల‌కు ఆటంకం లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాలని జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లను సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.