FbTelugu

తెలంగాణ సరిహద్దులు మూత: డిజిపి మహేందర్

హైదరాబాద్: తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఆంక్ష‌లు మ‌రింత క‌ఠిన‌త‌రం చేశారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర స‌రిహ‌ద్దులు మూసివేస్తున్నట్లు డిజిపి ఎం.మ‌హేంద‌ర్‌రెడ్డి ప్రకటించారు.
ఇవాళ ఆయన కూకట్ పల్లిలో లాక్ డౌన్ అమలు జరుగుతున్న తీరుపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ విసి.సజ్జనార్ తో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం మేరకు అనుమతులు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారి వాహనాలను సీజ్ చేస్తున్నామని తెలిపారు. పాస్ లు ఉన్నవారిని ఎక్కడా ఆపడం లేదని, అంబూలెన్స్ లకు చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక దారి ఏర్పాటు చేశారన్నారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెళ్లేవారిని, ఎమర్జెన్సీ సర్వీసులో పనిచేసేవారిని ఆపడం లేదని మహేందర్ రెడ్డి అన్నారు.

స్విగ్గీ, జోమాటో వాహనాలు సీజ్
హైదరాబాద్ నగరంలో శనివారం నాడు స్విగ్గీ, జోమాటో వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. పలు ప్రాంతాలలో పోలీసులు నిలువరించడంతో డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. ప్రాణాలను లెక్క చేయకుండా ఫుడ్ డెలివరీ చేస్తుంటే తమ టూ వీలర్స్ ను జప్తు చేస్తున్నారని వాపోయారు. తమ సంస్థల నుంచి సమాచారం లేదని పోలీసులు అంటున్నారన్నారు. తమ వాహనాలను సీజ్ చేశారని, ఇళ్లకు ఎలా వెళ్లాలని డెలివరీ బాయ్స్ ప్రశ్నిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.