FbTelugu

ఎన్-95 మాస్కుల వేస్ట్: డీజీహెచ్ఎస్

ఢిల్లీ: మరింత సురక్షితం అంటూ ప్రజలు విరివిగా ఉపయోగిస్తున్న ఎన్-95 మాస్కులు పనికిరావంటూ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్ఎస్) ప్రకటించింది.
వీటి వినియోగంపై డీజీహెచ్ఎస్ కీలక సూచనలు చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్యాధికారులకు లేఖ రాసింది. వాల్వ్ కల్గిన ఎన్-95 మాస్కులతో ఉపయోగం లేదని స్పష్టం చేసింది వ్యక్తి నోటి నుంచి బయటకు విడుదలయ్యే వైరస్‌ను అవి ఆపలేవని పేర్కొంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యలకు ఇదొక అవరోధం అని తెలిపింది.
నోరు, ముక్కు పూర్తిగా మూసేసే మాస్కులను మాత్రమే వినియోగించాలని సూచించింది. ఆ దిశగా అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను డీజీహెచ్ఎస్ కోరింది.

You might also like