FbTelugu

దైవ దర్శనాలకు వేళాయే..

త్వరలోనే పలు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తులు దైవ దర్శనాలు చేసుకునే అవకాశం పొందనున్నారు. దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా గత కొంతకాలంగా దాదాపు అన్ని గుళ్లూ మూతపడ్డ విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ కు కొన్ని సడలింపులను ఇచ్చింది.

దీంతో భక్తుల దర్శనాలకు శ్రీకాలహస్తి, కాణిపాకం, ఇంద్రకీలాద్రి ఆలయాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. మే 18 నుంచి భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. క్యూలైన్లలో భక్తుల మధ్య దూరం కనీసం మీటరు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే భక్తులకు మాస్కు, థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ స్టాండ్లు తప్పనిసరి అని తెలుస్తోంది.

You might also like