FbTelugu

రైతు సమస్యలు తీర్చమంటే దాడులా? : దేవినేని ఉమ

అమరావతి: రాష్ట్రంలో రైతుల సమస్యలు తీర్చమని కోరితే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో ఏర్పాటైన లేఔట్లకు వైసీపీ నేతలు ఇప్పుడు సిగ్గు లేకుండా తమ పేర్లు పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఇళ్ల పట్టాలను రద్దు చేసే అధికారం వైసీపీ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించారు. తనను తిడితేనో, నిజాలను ప్రజలకు చెప్పే పత్రికలను తిడితేనో తాను భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ సారి తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని, ఆ వెంటనే మళ్లీ ఎన్టీఆర్ పేరిట పట్టాలు ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.