FbTelugu

 రాజ్యంగం గొప్పది… ప్రభుత్వం శాశ్వతం కాదు: దేవినేని

అమరావతి: ఎన్నికల ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని నమ్మించిన జగన్… అధికారంలోకి వచ్చాక మాట మార్చి, ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు.
ఇవాళ వెలగపూడి, తుళ్లూరులో రైతులు, మహిళల ధర్నా శిబిరాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా సందర్శించారు. ధర్నా చేస్తున్నవారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఆనాడు మద్దతు పలికి ఇప్పుడు మాటమార్చారన్నారు. రాజ్యం, రాజ్యాంగం గొప్పది.. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, రైతులు, మహిళలది ధర్మపోరాటం, న్యాయపోరాటం అని దేవినేని అభివర్ణించారు.

న్యాయస్థానాల్లో రైతులు విజయం సాధించడం ఖాయమని, కరోనా వేళ ప్రాణాలకు తెగించి రైతులు పోరాడుతున్నారని ఆయన అన్నారు. రాజధాని కోసం 70 మంది రైతులు చనిపోతే ప్రభుత్వం నుంచి ఒక్కరూ రాలేదన్నారు. రాజధాని సమస్య 29 గ్రామాల సమస్య కాదు.. ఐదు కోట్ల మంది ప్రజలది మాజీ మంత్రి దేవినేని పునరుద్ఘాటించారు.

You might also like